Saturday, January 28, 2012

తొలి అడుగు



ఆలోచనలలో సగం జీవితం
ఆవేదనలతో సగం జీవితం
గడిచిపోతోంది కుంటు కుంటు
నడిచిపోతోంది కాలం
నర్మగర్భంగా నవ్వుకుంటు
అప్పుడప్పుడుతొంగిచూస్తోంది
ఆనందం నేనున్నానంటూ
అంతుతెలియనిసాగరంలో
అనవరతం ఈదే పుష్పాలం
గాలంవేసే జాలరివలలో
చిక్కుటకొరకేపుట్టిన
జలపుష్పాలం.

0 comments:

Post a Comment

 

చినుకులు © 2008. Template Design By: SkinCorner